ఆకాశమే హద్దుగా పెట్రోల్ ధరలు.. ఇలా అయితే కష్టమే

ఆకాశమే హద్దుగా పెట్రోల్ ధరలు.. ఇలా అయితే కష్టమే

పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వరుసగా పెంచుతూ చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దాంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.104.14కు చేరగా.. డీజిల్‌ ధర రూ.92.82 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.110.12పైసలకు చేరగా..  డీజిల్‌ ధర రూ.100.66కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పున పెరిగాయి. దాంతో హైదరాబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.33 పైసలకు చేరగా.. డీజిల్‌ ధర రూ.101.27 పైసలకు చేరింది. పెట్రో ధరల పెంపుతో సామాన్యులు ఆందోళనలో పడ్డారు. పెట్రోల్ ధరలు ఇలాగే పెరిగితే.. తాము వాహనాలు నడపడం కష్టమేనని వాపోతున్నారు.

For More News..

‘మా’ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా? 

స్కూల్‎కు వెళ్తున్న మైనర్‎ను ఎత్తుకెళ్లి గ్యాంగ్‎రేప్

మొదలైన ‘మా’ ఎన్నికలు.. మోహన్‎బాబు, ప్రకాశ్ రాజ్‎ల మధ్య ఆసక్తికర సన్నివేశం