ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..

ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..

ఉత్తర భారత దేశంలో కురుస్తున్న వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి.  దీంతో కాలువలు నదుల్ని, నదులు సముద్రాల్ని తలపిస్తున్నాయి. ఉత్తరాఖండ్​లోని యమునా నది జులై 10తో గరిష్ట నీటి మట్టానికి చేరుకోబోతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీలో కేంద్ర జల సంఘం అప్రమత్తమైంది. నీటి మట్టం 205.3 మీటర్ల ప్రమాద స్థాయిని దాటవచ్చని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సంరక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద నది నీటిమట్టం 204.36 మీటర్లుగా నమోదైంది. 

ALSO READ :ఏపీ ప్రజలకు అలర్ట్.. జులై 10న రాత్రికి కుండపోత వర్షం

రివర్ గరిష్ట  స్థాయి నీటి మట్టం 204.50 మీటర్లు.  హతిన్‌కుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి నీటిని నిరంతరం విడుదల చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.  బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2,17,003 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వర్షాల ధాటికి ఉత్తర భారత్​లోని చాలా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్..  వర్షాలు.. పబ్లిక్​ పడుతున్న ఇబ్బందులు.. సహాయక చర్యలపై అధికారులతో పర్యవేక్షణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.