ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చిలా..

ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చిలా..

ఇంటర్ చదువుతున్న రమ్య (పేరు మార్చాం)కి ఇన్స్టాగ్రామ్ లో ఓ అబ్బాయి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మ్యూచువల్ ఫాలోవర్స్ ఉన్నారని ఆమె యాక్సెప్ట్ చేసింది. అతడు రమ్య పెట్టే ప్రతి పోస్ట్ లైక్ కొట్టేవాడు. కామెంట్లు పెట్టేవాడు. చాటింగ్ కూడా మొదలైంది. చనువు పెరగడంతో రమ్య తన ఫొటోలు పంపింది. ఆ వెంటనే 'కలుద్దాం' అని మెసేజ్ వచ్చింది అతడ్నించి ఆమె కుదరదనడంతో.. నీ ఫొటోలు, మెసేజ్లు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. రమ్య ఒత్తిడి తట్టుకోలేక పేరెంట్స్కు విషయం చెప్పింది. వాళ్లు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ ఇస్తే.. రమ్యని బ్లాక్ మెయిల్ చేస్తోంది ఆమె క్లాస్ మేట్ అరుణ్ అని తేలింది. రమ్యని ట్రాప్ చేయడానికే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడట అతడు.

  • రమ్యలాంటి బాధితులు మన చుట్టుపక్కల గల్లీకొక రు ఉన్నారు. రోజుకి ఇలాంటి సంఘట ల లలో జరుగు తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫాంలోనైనా మైనర్లే టార్గెట్గా ఫేక్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి సైబరాబాద్ డిసీపీ సి. అనసూయ చెప్తున్న జాగ్రత్తలివి.
  • 18 - 23 ఏండ్ల అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్ల ఫ్రెండ్ లిస్ట్ల ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కు వగా ఉంటున్నాయి. పరిచయం పెంచుకుని అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరిం చడం, వాటిని మార్ఫింగ్ చేసి బెదిరించడం లాంటివి చేస్తున్నారు. అందుకే అమ్మాయిలు తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే, బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేయాలి. వాళ్లు ఎప్పట్నించి సోషల్ మీడియాలో ఉన్నారన్నది చెక్ చేయాలి. ప్రొఫైల్ ఫొటో, ఎలాంటి పోస్ట్లు లేని రిక్వెస్ట్ లని అసలు యాక్సెప్ట్ చేయకూడదు.
  •  పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పర్సనల్ ఫొటో, వీడియో అప్లోడ్ అయిందంటే పరిస్థితి చెయ్యి దాటిన ట్టే. మాకు సమాచారం ఇచ్చినా.. మేము ట్రేస్ చేసే గ్యాప్లోనే.. చాలామంది ఆ ఫొటోల్నిడౌన్ లోడ్ చేసుకుంటారు. అందుకే అమ్మాయిలు తెలియని వ్యక్తులకి ఫొటోలు, వీడియోలు పం పకూడదు. అలాగే సోషల్ మీడియా అకౌంట్ ప్రైవేట్లో ఉన్నా.. పబ్లిక్లో ఉన్నా.. షేర్ చేసే పోస్ట్లు ఎవరూ డౌన్లోడ్ చేసుకోకుండా సె ట్టింగ్స్ పెట్టుకోవాలి. వేరేవాళ్లు తమ పోస్ట్లకు మనల్ని ట్యాగ్ చేయకుండా సెట్టింగ్స్ మార్చు కోవాలి. అంతేకాకుండా పబ్లిక్ అకౌంట్స్లో ఎంతోమంది మెసేజ్లు, కామెంట్లు పెడుతుం టారు. అలాకాకుండా ఫాలో అయ్యేవాళ్లకి, ఫ్రెండ్స్కి మాత్రమే మెసేజ్ పంపే ఛాయిస్ ఇవ్వాలి. వీటన్నింటితో పాటు తెలియక ఎవరి నైనా ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసినా వాళ్ల ప్రవర్తన మితిమీరితే వెంటనే బ్లాక్ చేయాలి.
  •  అమ్మాయిల అకౌంట్స్ ని హ్యాక్ చేసి, అందులోని ఫొటోల్ని మార్ఫింగ్ చేసేవాళ్లు ఉన్నారు. ఇలాంటి వాటికి చిక్కకూడదంటే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో టు స్టెప్ వెరిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆన్ చేసుకుంటే మన అకౌంట్లు ఇంకొకరి చేతుల్లో పడకుండా ఉంటాయి.·

ఫేక్ అకౌంట్స్లో చాలావరకు ప్రొఫైల్ ఫొటోలు గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసినవే ఉంటాయి. అందుకే తెలియని వ్యక్తుల రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేముందు... గూగుల్ ఇమేజ్ టూల్లోకి వెళ్లి వెరిఫై చేయాలి. అలాగే వాళ్ల ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ని చెక్ చేయాలి. బయోడేటాని మ్యాచ్ చేసి చూడాలి. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్లు అన్నది చూడాలి. నిక్ నేమ్స్, నెంబర్స్తో ఉండే అకౌంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లని యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే హీరో, హీరోయిన్లు ఫొటోల్ని, దేవుడి బొమ్మల్ని ప్రొఫైల్గా పెట్టుకున్నా అనుమానించాల్సిందే. ఒకరిద్దరు ఫాలోవర్స్ మాత్రమే ఉన్న అకౌంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లని పట్టించుకోకూడదు. ఒకే అకౌంట్ నుంచి పదేపదే రిక్వెస్ట్ వస్తుందంటే అది ఫేక్ అకౌంట్ అనే అర్థం. అన్నింటికీ మించి... సరదాగా మాట్లాడుతున్నారు. కదా! అని తెలియని వ్యక్తుల్ని కలవకూడదు. అప్పుడే ఈ మోసాల బారినుంచి తప్పించుకోగలుగుతారు.