పీఎం–కిసాన్‌ కింద రైతులకు రూ. 50,850 కోట్లు

పీఎం–కిసాన్‌ కింద రైతులకు రూ. 50,850 కోట్లు

న్యూఢిల్లీ: పీఎం–కిసాన్‌ స్కీము కింద రైతులకు రూ. 50,850 కోట్లను అందించినట్లు శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాగు పెట్టుబడి, ఇంటి ఖర్చులు వంటి రైతుల అవసరాల కోసం ప్రతిష్టాత్మకమైన ఈ పీఎం–కిసాన్‌ స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 24న పీఎం–కిసాన్‌ స్కీము మొదటి బర్త్‌‌డే జరుపుకోనుంది. కిందటేడాది ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌‌లోని గోరఖ్‌ పుర్‌‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పీఎం–కిసాన్ స్కీమును లాంఛ్‌ చేశారు. ఈ స్కీము కింద ఏటా రూ. 6 వేలను మూడు దఫాలుగా రైతులకు అందిస్తారు. రైతుల బ్యాంకు అకౌంట్లలోకే నేరుగా ఈ డబ్బును పంపిస్తున్నారు. అధిక ఆదాయం ఉండే వారిని ఈ స్కీము నుంచి మినహాయించారు. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌ ) స్కీము ఫిబ్రవరి
24న మొదటి యానివర్సరీ జరుపుకోనున్నట్లు అధికారిక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని రైతులందరికీ సాగు పెట్టుబడి, ఇంటి ఖర్చులు అందించేందుకు ఈ స్కీమును తెచ్చినట్లు పేర్కొంది. పీఎం–కిసాన్‌ స్కీము కింద మొత్తం 14 కోట్ల మంది రైతులు లబ్దిదారులున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 దాకా 8.46 కోట్ల రైతు కుటుంబాలకు బెనిఫిట్స్‌ అందించినట్లు పేర్కొంది. లబ్దిదారులను గుర్తించే బాధ్యతను రాష్ట్రాలు, యూనియన్‌ టెరిటరీలకే అప్పచెప్పారు. రెండు హెక్టార్ల దాకా సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ఇన్‌ కంసపోర్ట్‌‌ను ఈ స్కీము కింద అందించాలని మొదట అనుకున్నా ఆ తర్వాత విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలని నిర్ణయించారు. గత ఎసెస్‌‌మెం‌ట్‌ ఇయర్‌‌లో ఇన్‌ కంటాక్స్‌ కట్టిన సంపన్న రైతులను మాత్రం స్కీము నుంచి మినహాయించారు.