బెల్టు షాపులు మూసివేస్తేనే నిధులు తెస్తా: రాజగోపాల్ రెడ్డి

బెల్టు షాపులు మూసివేస్తేనే నిధులు తెస్తా: రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి (చండూరు) వెలుగు : గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను మూసివేస్తేనే అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లి మండలం కేతెపల్లి, మెల్లవాయి, ఫకీర్ పురం (పులికుంట్ల) సుంకిశాల గ్రామాల్లో కొత్తగా నిర్మించిన  గ్రామ పంచాయతీ భవనాలు,  నరసింహులు గూడెం, పసునూరులో హెల్త్‌‌‌‌‌‌‌‌ సబ్ సెంటర్లు, పోగుల గోవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య పసునూరు సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పోగుల దివ్య రెడ్డి నిర్మించిన బస్ షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించారు.

అలాగే బండ తిమ్మాపురం వద్ద రూ.2.93 కోట్లతో చేపట్టిన హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీ భవనాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌,  సెక్రటరీ రూమ్‌‌‌‌‌‌‌‌కు అటాచ్ బాత్రూంలతో పాటు బయట కామన్ బాత్ రూమ్, ఒక వెయిటింగ్ హాల్, కాంపౌండ్ హాల్ ఉండేలా రీడిజైన్ చేయాలని సూచించారు. ఈ మేరకు ఎస్టిమేషన్ రెడీ చేసి ఇస్తే నిధులు మంజూరు చేస్తానన్నారు.

ఫకీర్ పురం పేరు మార్చి పులికుంట్ల పేరు పర్మినెంట్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. సుంకి శాల జపీ భవనానికి స్థలాన్ని ఇచ్చిన యుగంధర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఈ రఘుపతి  
పాల్గొన్నారు.