న్యూఢిల్లీ: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన ‘షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్’ను భారత్‌లో మరింత విస్తరించింది. ఇందులో భాగంగా ఈ–-కామర్స్ కంపెనీలైన అమెజాన్, అజియో, మీషో, స్నాప్‌డీల్, టాటా క్లిక్ సంస్థలతో పార్టనర్షిప్ కుదుర్చుకుంది. ఇప్పటికే ఉన్న ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, పర్పుల్, షాప్సీ, తీరా వంటి సంస్థలతో పాటు ఇప్పుడు కొత్తగా చేరిన పార్టనర్లతో ఫ్యాషన్, బ్యూటీ, నిత్యావసర వస్తువులన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి.
ఒక కంపెనీ లేదా ఈ-–కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ప్రొడక్ట్‌ను క్రియేటర్లు (యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు లేదా వెబ్సైట్ నిర్వాహకులు) తమ కంటెంట్ ద్వారా ప్రమోట్ చేసి, అమ్మకాలు జరిగేలా చూస్తే.. ప్రతీ సేల్‌పై ఆ కంపెనీ వారికి కొంత శాతం కమీషన్ చెల్లిస్తుంది. దీనినే షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటారు. యూట్యూబ్ దీనిని విస్తరిస్తోంది.
భారతీయ కంటెంట్ క్రియేటర్లకు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం 2025-–2026 జూన్ క్వార్టర్లో 160శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటు (100శాతం) కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా ఇండియాలో యూట్యూబ్ షాపింగ్ ఆధారిత వీడియోలు చూసే సమయం ఏడాదిలోనే 55శాతం పెరిగింది. 45 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ప్రొడక్ట్‌ల వివరాలు చూస్తున్నారు.
