ప్రారంభమైన G7 దేశాల సదస్సు.. హాజరుకానున్న మోడీ

ప్రారంభమైన G7 దేశాల సదస్సు.. హాజరుకానున్న మోడీ

G7 దేశాల సదస్సు ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో ప్రారంభమైంది. G7 సభ్య దేశాలైన కెనెడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్, అమెరికా దేశాల అధినేతలు సదస్సులో పాల్గొన్నారు.  అలాగే యురోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ కూడా G7 సదస్సుకు హాజరయ్యారు. బియారిట్జ్ లోని హోటల్ డు పలాసిస్ లో ఈ సదస్సు జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నారు.ఈ సారి జరిగేది 45వ సదస్సు.

ఈ సదస్సుకు ఆస్ట్రేలియా, చిలీ, ఈజిప్ట్, ఇండియా, స్పెయిన్, ర్వాండా దేశాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారత ప్రధాని మోడీ సహా ఆయా దేశాల అధినేతలు సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఇరాన్ న్యూక్లియర్ డీల్ లాంటి అంశాలపై G7 సదస్సులో ప్రధాన చర్చ జరుగుతోంది. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుపై కూడా చర్చిద్దామని సదస్సుకు ముందే ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ప్రకటించారు.