ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన.. గదర్2 మూవీ

ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన.. గదర్2 మూవీ

గదర్2(Gadar2)..బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. దేశభక్తి కథాంశంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలించింది.

లేటెస్ట్గా ఈ మూవీ వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయి 30 రోజులు అవుతున్నా.. తగ్గిదేలే అన్నట్టు వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఈ మూవీ ఇప్పటివరకు రూ.512 కోట్లు వసూళ్లు చేసి..భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2'వ హిందీ మూవీగా బాహుబలి 2ను రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో పఠాన్ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా..గదర్ 2 మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

దీంతో ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికీ థియేటర్స్ లలో జనాలు ఎగబడుతున్నారు.కేవలం రూ.75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఈ రికార్డ్ కలెక్షన్స్ వసూళ్లు చేయడమే చాలా గ్రేట్ అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 

ALSOREAD:త్రిషకి లిప్​లాక్​ ఇవ్వలేనన్న విజయ్..ఎందుకో తెలుసా?

అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2 చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ మరియు ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి వారంలో ₹284.63 కోట్లు, రెండో వారంలో ₹134.47 కోట్లు, మూడవ వారంలో ₹63.35 కోట్లు వసూలు చేసింది. ఐదవ శుక్రవారం, ఈ చిత్రం ₹90 లక్షలను రాబట్టింది.

అయితే షారుక్ ఖాన్ జవాన్ సినిమా రిలీజ్ అవ్వడం తో గదర్ 2 కలెక్షన్లకు కాస్త బ్రేక్ పడింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫిల్మ్ క్రిటిక్ శుభ్ర గుప్తా చిత్రానికి 1.5 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు.