త్రిషకి లిప్​లాక్​ ఇవ్వలేనన్న విజయ్..ఎందుకో తెలుసా?

త్రిషకి లిప్​లాక్​ ఇవ్వలేనన్న విజయ్..ఎందుకో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi).. త్రిష(Trisha) జంటగా నటించిన ‘96’ సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా..నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమాలో ఎమోషనల్​గా సాగే క్లైమాక్స్​ ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఎయిర్​పోర్ట్​లో హీరోహీరోయిన్లు విడిపోవాల్సి వచ్చినప్పుడు ఒకరినొకరు చేతులు పట్టుకుని అలా ఉండిపోతారు.

అయితే, ఈ సీన్​లో లిప్​లాక్​ ఉండాలని దర్శకుడు రాసుకున్నాడట. కానీ, విజయ్​ సేతుపతి షూటింగ్​ టైంలో త్రిషను ముద్దు పెట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడట. దీంతో లిప్​లాక్​ సీన్​ లేకుండానే షూటింగ్​ను కంప్లీట్​ చేసేశారు. అయినప్పటికీ క్లైమాక్స్​ సినిమాకు హైలెట్​గా నిలిచింది. విజయ్​సేతుపతితో పాటు త్రిష కెరీర్​లోనూ 96 గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. 

సినిమా అంతా చాలా స్వచ్ఛమైన ప్రేమను చూపించిన డైరెక్టర్..క్లైమాక్స్ వరకి అదే కంటిన్యూ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఒకవేళ క్లైమాక్స్ లో లిప్ కిస్ ఉండి ఉంటే 96 కథకి సెట్ అయ్యేది కాదని, విజయ్ సేతుపతి నో చెప్పి చాలా మంచిపని చేశాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. విజయ్ ఇదివరకే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..తన మూవీస్ లో లిప్ లాక్ ఇవ్వనంటూ పేర్కోన్నారు. 

విజయ్ సేతుపతి తన యాక్టింగ్తో ప్రతి ఒక్కరినీ టచ్ చేస్తాడు. బాలీవుడ్,టాలీవుడ్, కోలీవుడ్ లోను హీరోగా, విలన్గా తనకంటూ స్పెషల్ స్టేటస్ని క్రియేట్ చేసుకున్నారు విజయ్ సేతుపతి.  ఎలాంటి క్యారెక్టర్ చేసిన ఆడియన్స్ విజయ్ని ఒప్పుకుంటారు. దీంతో విలన్గా కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. తెలుగులో ఉప్పెన మూవీలో విలన్గా చేసి, ఆడియన్స్తో శభాష్ అనిపించుకున్న విజయ్ వరుస మూవీస్తో బిజీగా ఉన్నారు.

ALSOREAD:ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన.. గదర్2 మూవీ

మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పొన్నియన్ సెల్వన్  మూవీతో హీరోయిన్ త్రిష మంచి గుర్తింపు పొందింది. త్రిషకు అవకాశాలు తగ్గతున్న టైంలోనే వచ్చిన పొన్నియన్ సెల్వన్..మరిన్ని అవకాశాలు వచ్చేలా చేసింది.

ప్రసెంట్ త్రిష లియో మూవీలో దళపతి విజయ్కి హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇక ఈ మూవీపై ఆడియన్స్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే..త్రిష ఇంకొన్నాళ్ళు మళ్ళీ బిజీ హీరోయిన్గా మారుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక త్రిష నటించిన ‘ది రోడ్​’ అనే సినిమా వచ్చే నెల (అక్టోబర్6న) విడుదల కానుంది.