ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టాం : గడ్డం వంశీ కృష్ణ

ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టాం : గడ్డం వంశీ కృష్ణ

ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ పై తాము దృష్టి పెట్టామని విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీ కృష్ణ తెలిపారు. ఐటీసీ కాకతీయలో సీఐఐ యాన్యువల్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టెక్స్ టైల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, సోలార్ ప్యానెల్స్ బిజినెస్ లో ఉన్నామని చెప్పారు. గ్రీన్ ఇండియాలో భాగంగా చెట్లు నరకకుండా బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ తో వివిధ రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ బైక్ ఆటం తీసుకొచ్చామని.. మార్కెట్ లో మంచి రిజల్ట్స్ వచ్చాయని  తెలిపారు

రోజురోజుకు చెట్లు తగ్గిపోతున్నాయని.. ఫర్నిచర్, బిల్డింగ్స్ కోసం చెట్లను నరికేస్తున్నారని వంశీ కృష్ణ వ్యాఖ్యానించారు. దీనికి ప్రత్యామ్నాయంగా  చెట్లు నరకకుండా ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్ మెటీరియల్స్ రెడీ చేస్తున్నామన్నారు. తమ ఇండస్ట్రీలో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రోజురోజుకు పెరిగిపోతుందన్న ఆయన.. ప్లాస్టిక్ తో మానవాళికి ముప్పు ఉందన్నారు. అలాంటి ప్లాస్టిక్ వేస్టెజ్ తో వివిధ రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఆటం సోలార్ రూఫ్ ప్యానెల్ సిస్టమ్ తీసుకొచ్చామన్నారు.  ఫ్యూచర్ అంతా ఎలక్టిక్ వెహికిల్ హవా నడుస్తుందని వ్యాఖ్యానించారు. పర్యావరణ ప్రతికూలతలో భాగంగా ఈవీ ఎలక్ట్రిక్‌ వెహికిల్ ఆటం బైక్ తీసుకొచ్చామని వెల్లడించారు.