తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలె: గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలె: గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి: అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కోరుకున్నట్లు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చెప్పారు. ఇవాళ  ధర్మారం మండలం ఖిలా వనపర్తిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర రథోత్సవంలో ధర్మపురి ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి వంశీ కృష్ణ పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి  ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం  విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ లక్ష్మీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్న తెలిపారు.