
గద్వాల, వెలుగు: ఖరీఫ్‌లో రైతులు పండించిన వడ్ల కొనుగోళ్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వడ్ల కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వడ్ల కొనుగోలుకు జిల్లాలో 84 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, నవంబర్ మొదటి వారం నుంచి రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.
సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేసుకోవాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. గత సీజన్ లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉందన్నారు. ఈ సీజన్లో 2.97 లక్షల టన్నుల వడ్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, మార్కెటింగ్ ఆఫీసర్ పుష్పమ్మ, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏటీసీలో క్లా
సులు ప్రారంభించాలి..
ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)లో పనులు కంప్లీట్ చేసి క్లాసులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. పట్టణంలోని ఏటీసీ కొత్త బిల్డింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన పనులు ఈ నెల 20లోగా పూర్తి చేయాలని, ఆ తరువాత క్లాసులు ప్రారంభించాలని సూచించారు. లేబర్ ఆఫీసర్ మహేశ్‌కుమార్, ఐటీఐ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇండ్లను నాణ్యతగా నిర్మించుకోవాలి..
ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతగా నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, మట్టిని అందించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జానకీరామ్
ఉన్నారు.