గద్వాల జిల్లాలోని హాస్టల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి : హాస్టల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయకర్

గద్వాల జిల్లాలోని  హాస్టల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి : హాస్టల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయకర్

గద్వాల టౌన్, వెలుగు: జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని హాస్టల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయకర్, కార్యదర్శి ఆనంద్ రాజు కోరారు. ఈ మేరకు సోమవారం  కలెక్టర్ సంతోష్​కు వినతిపత్రం అందించారు. ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కార్మికులకు 13 నెలల నుంచి, బీసీ హాస్టళ్ల కార్మికులకు 8 నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు.

 కుటుంబ పోషణకు వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా కార్మికులను నియమించి పని భారం తగ్గించాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లకు 3 నెలల వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ కోరారు. కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.