గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు

గద్వాల టౌన్, వెలుగు : గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ వీవీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖలీమ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​లో కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను పలువురు అభినందించారు.