గద్వాల, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఎన్నికల ఖర్చుల ఖాతా నిర్వహణ పత్రాలు అందజేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం మల్లకల్ గ్రామపంచాయతీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన మల్లకల్-1, ఎంఈవో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మల్లకల్-2, తాటికుంట గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
పోటీ చేసే అభ్యర్థుల డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎంపీడీవో ఆంజనేయ రెడ్డి, ఎంఈవో సురేశ్ ఉన్నారు.
