ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..14 మంది స్టూడెంట్స్ కు అస్వస్థత.. గద్వాల జిల్లా భీమ్ నగర్ హాస్టల్లో ఘటన

ఎస్టీ హాస్టల్  లో ఫుడ్ పాయిజన్..14 మంది స్టూడెంట్స్   కు అస్వస్థత.. గద్వాల జిల్లా భీమ్ నగర్ హాస్టల్లో ఘటన

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాకేంద్రంలోని భీమ్ నగర్ లో ఉన్న ఎస్టీ హాస్టల్​లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్​లో   మొత్తం 128 స్టూడెంట్స్ ఉన్నారు. మంగళవారం ఉదయం కొందరు ఉప్మా, మరికొందరు అరటి పండ్లు, బిస్కెట్లు తిన్నారు. అందులో  14 మంది విద్యార్థులకు కడుపునొప్పితో పాటు కళ్లు తిరగాయి. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఉదయం బూస్ట్ తాగాక ఉప్మా తిన్నామని, ఉప్మాలో పురుగుల వచ్చాయని విద్యార్థులు ఆరోపించారు. స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హాస్పిటల్​ సూపరింటెండెండ్ శ్రీనివాస్ తెలిపారు.