గద్వాల, వెలుగు: హాస్టల్ లోని స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందించాలని డీడబ్ల్యూవో నుషిత ఆదేశించారు. సోమవారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఆమె తనిఖీ చేశారు. వంట గది, బాత్రూంలు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టూడెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నెలా హెల్త్ క్యాంప్ నిర్వహించి స్టూడెంట్లకు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలన్నారు. మూడు నెలలకోసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

