దసరా ఉత్సవాలు 2025: గద్వాలలో రూ.5,55,55,555తో అమ్మవారి అలంకరణ

దసరా ఉత్సవాలు 2025:  గద్వాలలో రూ.5,55,55,555తో అమ్మవారి అలంకరణ

 గద్వాల టౌన్‌, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాలలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ. 5,55,55,555 కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించారు. అదేవిధంగా నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని రూ. 10 లక్షలతో అలంకరించారు.