గెయిల్‌‌‌‌ లాభం 52% డౌన్‌‌‌‌

గెయిల్‌‌‌‌ లాభం 52% డౌన్‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ  కంపెనీ గెయిల్‌‌‌‌కు ఈ ఏడాది  జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ1) ‌‌‌‌లో రూ.1,412 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.2,915 కోట్లతో పోలిస్తే ఇది 52 శాతం తక్కువ. క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఆన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌  ప్రకారం చూస్తే కంపెనీ ప్రాఫిట్‌‌‌‌  రూ.603.52 కోట్ల నుంచి 134  శాతం పెరిగింది. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో గెయిల్ రెవెన్యూ రూ.32,227.47 కోట్లుగా రికార్డయ్యింది. 

కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.37,572.14 కోట్లతో పోలిస్తే ఇది 14.22 శాతం తక్కువ. కంపెనీకి ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.32,858.20 కోట్ల ఆదాయం వచ్చింది. కంపెనీ షేర్లు సోమవారం సెషన్‌‌‌‌లో  1.79 శాతం లాభపడి 119.60 దగ్గర క్లోజయ్యాయి. ఫారిన్ బ్రోకరేజి కంపెనీ యూబీఎస్‌‌‌‌  గెయిల్ షేర్లపై ‘బై’ రేటింగ్ ఇచ్చి, టార్గెట్ ధరను రూ.150 కి అప్‌‌‌‌గ్రేడ్ చేసింది. గతంలో సెల్ రేటింగ్ ఇచ్చింది.