రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నాలుక కోస్తాం - గజ్జెల కాంతం

రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నాలుక కోస్తాం - గజ్జెల కాంతం

 

హైదరాబాద్, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం హెచ్చరించారు. బుధవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో పిడమర్తి రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసని చెప్పారు. గత పదేండ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న సంపదపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు.