
హైదరాబాద్, వెలుగు: శామ్సంగ్ఇటీవల విడుదల చేసిన ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ఫోన్ల అమ్మకాలు గురువారం నుంచి మనదేశంలో మొదలయ్యాయి. ‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24+ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్‌ఫోన్‌లు లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్ ట్రాన్‌స్క్రిప్ట్ అసిస్ట్ ఫీచర్‌లతో వస్తాయి. శామ్సంగ్ కీబోర్డ్‌లోని ఏఐ హిందీతో సహా 13 భాషల్లో రియల్‌టైంలో మెసేజ్‌లను అందిస్తుంది. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ భారతదేశంలోని శామ్సంగ్ నోయిడా ఫ్యాక్టరీలో తయారవుతోంది. ఈ ఫోన్ల కోసం రికార్డ్ స్థాయిలో ప్రీ-బుకింగ్‌లను శామ్సంగ్ పొందింది. ధరలు రూ.80 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉంటాయి.
బిగ్‌సీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి..
మొబైల్స్ రిటైలర్ బిగ్‌సీ ద్వారా శామ్సంగ్ ఎస్24 సిరీస్ ఫోన్లను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ బాలు చౌదరి, డైరెక్టర్లు, సినీతార మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సిరీస్ఫోన్లలో అధునాతమైన ఫీచర్లు ఉన్నారని, వీటిని తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ చేయడానికి శామ్సంగ్తమను ఎంపిక చేసుకుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సీ నంబర్‌వన్ మొబైల్రిటైల్ చెయిన్‌గా మొదటిస్థానంలో ఉందని చౌదరి చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు కూడా ప్రొడక్ట్ లాంచింగ్ కోసం బిగ్‌సీ ఎంచుకుంటాయని ఆయన వివరించారు.