Thaman Jaragandi Song: జరగండి..జరగండి ట్యూన్..తమన్ కాపీ కొట్టాడా!..అది ఏ సాంగ్?

Thaman Jaragandi Song: జరగండి..జరగండి ట్యూన్..తమన్ కాపీ కొట్టాడా!..అది ఏ సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game changer). తమిళ స్టార్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ జరగండి..జరగండి సాంగ్ ఇవాళ (మార్చి27న) చరణ్ బర్త్ డే స్పెషల్గా రిలీజ్ చేశారు. 'జరగండి... జరగండి...' సాంగ్ ట్యూన్, లిరిక్స్ వంటి వాటితో సంబంధం లేకుండా రామ్ చరణ్ స్టైల్,డ్యాన్స్ అభిమానుల్ని అట్ట్రాక్ట్ చేసేలా ఉంది.

ఈ పాటలో గ్లామర్, విజువల్స్  శంకర్ స్టైల్లో ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ అండ్ పెప్పీ స్టైల్  ఈ పాటలో పొందుపరిచారంటూ మోత మోగించేస్తున్నారు. కానీ, ఇక్కడ మరో విషయం దాగుంది. దాన్ని నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా బయటికి తెస్తున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..జరగండి..జరగండి సాంగ్ ను తమన్ కాపీ కొట్టాడంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరీ ఈ మోస్ట్ వెయిటింగ్ సాంగ్ కి..ఏ సాంగ్ తో పోలికలో ఉన్నాయో తెలుసుకోవాలి కదా..చూద్దాం.

Also Read: ప్రభాస్ బాటలోనే ఎన్టీఆర్.. ప్రశాంత్ మూవీ కోసం క్రేజీ డెసిషన్

ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలోని సుర్రో సుర్రా అనే సాంగ్ ట్యూన్ విన్నట్టు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ  సూర్రో సాంగ్ ను కంపోజ్ చేసింది తమన్ గురువు మణిశర్మ.  అయితే మణిశర్మ దగ్గర తమన్ శిష్యుడిగా ఉన్న సంగతిని గుర్తుచేస్తూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడం షురూ చేశారు. మరీ ఈ కామెంట్స్ ఎంతవరకు వెళతాయో చూడాలి.

ఏదేమైనా తమన్ ని ఎంత గట్టిగా అంటే..అంతకు అంత వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. జరగండి సాంగ్ కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా..డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాట పాడారు.