ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఆట ముగిసినట్టే..నవాజ్‌‌‌‌ షరీఫ్‌‌‌‌ కుమార్తె మర్యమ్​ నవాజ్‌‌‌‌

ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఆట ముగిసినట్టే..నవాజ్‌‌‌‌ షరీఫ్‌‌‌‌ కుమార్తె మర్యమ్​ నవాజ్‌‌‌‌

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌‌‌‌ పై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ పార్టీ నుంచి కీలక నేతలు వరుసగా బయటకు వచ్చేస్తున్నారని ఇక ఇమ్రాన్ ఆట ముగిసినట్టేనని చెప్పారు. వెహారిలో జరిగిన పీఎంఎల్-ఎన్ యువజన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 9న ఇమ్రాన్ ఖాన్‌‌‌‌ను అరెస్టు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతటా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, నిరసనల గురించి ఆమె మాట్లాడారు.

9వ తేదీన చోటు చేసుకున్న హింసకు ఇమ్రానే కారణమని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు చెపుతున్నారని అన్నారు. రావల్పిండిలోని జనరల్ హెడ్‌‌‌‌ క్వార్టర్స్, లాహోర్ కోర్ కమాండర్ హౌస్ (జిన్నా హౌస్)తో సహా సైనిక సంస్థలపై దాడుల తర్వాత భద్రతా దళాలు ఇమ్రాన్​ పార్టీకి వ్యతిరేకంగా అణచివేత ప్రారంభించాయి. దీంతో పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ నాయకుల వలసలు ప్రారంభమయ్యాయి. ఘర్షణల తర్వాత 70 మంది లాయర్లు, నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే, “నాయకుడే సరిగా లేనప్పుడు ప్రజలు అతని వైపు ఎలా నిలబడతారు?’’ అని ఇమ్రాన్ ఖాన్‌‌‌‌ను మర్యమ్ నవాజ్ ఎద్దేవా చేశారు.