సిద్దరామేశ్వర క్షేత్రంలో విశ్రాంతి గదులకు భూమి పూజ

సిద్దరామేశ్వర క్షేత్రంలో విశ్రాంతి గదులకు భూమి పూజ

బిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర మహాక్షేత్రాన్ని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో కొత్తగా ప్రతిష్టించిన మాత భూవనేశ్వరి దేవీ విగ్రహాలకు ఆయన పూజలు చేశారు. అనంతరం దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న విశ్రాంతి గదులకు భూమి పూజ చేశారు. విశ్రాంతి గదుల నిర్మాణాలకు ముందుకు వచ్చిన దాతలు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాజారాం, మిగతా దాతలను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ అందె మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఈవో శ్రీధర్, అర్చకులు సిద్దగిరి శర్మ, రామగిరి శర్మ, రాజు పంతులు, రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఎంపీపీ గాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ పద్మనాగభూషణంగౌడ్, విండో చైర్మన్లు గంగల భూమయ్య, నాగర్తి భూమిరెడ్డి, గోండ్ల సిద్దరాములు, బాలగౌని రాజగౌడ్, ఎంపీటీసీలు సవర్ణ ప్రభాకర్, బాబు, బండి చంద్రకళ, టెంపుల్ కమిటీ డైరెక్టర్​తాటికొండ బాబు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదంలో గాయపడిన మండలంలోని బస్వాపూర్ సర్పంచ్ మంజుల భర్త మల్లారెడ్డిని విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరామర్శించారు.