ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌లో గణపతి పూజ

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌లో గణపతి పూజ

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి పట్టణంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పావని దంపతులు కుటుంబసమేతంగా మహా గణపతి హోమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరై ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. అలాగే ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి దేవతల ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ చేతకానితనం వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని గ్రామ దేవతలను మొక్కుకున్నట్టు చెప్పారు.