
టాలీవుడ్ యంగ్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) ఒక మాస్ మసాలా స్కంధ(Skanda) మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఊరమాస్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి గండరబాయ్..గండరబాయ్..గందరగోళంలో పెట్టకమ్మాయ్..అంటూ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ధమకేధార్ జానపద సాహిత్యంతో అద్దిరిపోయే లిరిక్స్ అందించారు అనంత శ్రీరామ్(Anantha Sriram). మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చే మ్యూజిక్ తో థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను సింగర్ నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు.
గండరబాయ్..గండరబాయ్..గత్తెరా కౌగిట్లో సుట్టకమ్మాయ్.. బీట్ వచ్చే టైంలో, రామ్..శ్రీలీల(SreeLeela )దుమ్ముదులిపేలా డ్యాన్స్ ఇచ్చి పడేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచింది. ముందు అంత త్వరగా ఎక్కదు, తర్వాత అస్సల దిగదు.. అంటూ రామ్ తన సోషల్ మీడియాలో సాంగ్ పోస్ట్ చేయడంతో..థియేటర్లో ఏ రేంజ్ లో ఉంటుందో ఉహించుకోవాల్సిందే.ఈ సాంగ్ అప్డేట్ తో ఉస్తాద్ ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉంటారని మేకర్స్ తెలిపారు.
దర్శకుడు బోయపాటి శ్రీను.. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా తన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా స్కంధ మూవీను తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్( Zee Studios), పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.