అమెరికాలో గాంధీజీ విగ్రహం ధ్వంసం

అమెరికాలో గాంధీజీ విగ్రహం ధ్వంసం

అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి  అవమానం జరిగింది. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహాన్ని దుండగులు అగౌరవపరిచారు .గత కొద్దిరోజులుగా అమెరికాలో నల్లజాతీయులు ఆందోళన చేస్తున్నారు. లేటెస్టుగా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో న‌ల్ల‌జాతీయులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. గాంధీ విగ్ర‌హం ధ్వంసం ఘ‌ట‌న‌పై వాషింగ్ట‌న్ పార్క్ పోలీసులు విచార‌ణ చేపట్టారు. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ న‌ల్ల‌జాతీయుడిని పోలీసులు హ‌త‌మార్చ‌డంతో.. అమెరికా అంత‌టా ఆందోళ‌న‌లు తీవ్రతరమైయ్యాయి. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మ‌కంగా మారాయి.  అయితే వాషింగ్ట‌న్‌లోని భార‌తీయ దౌత్య‌కార్యాల‌యంలో.. గాంధీ విగ్ర‌హం ధ్వంసం కావ‌డం కూడా ఆందోళ‌న‌కారులు ప‌నే అని తేలింది.

అమెరికాలో గాంధీ  విగ్రహాంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ స్పందించారు. వాషింగ్టన్ డీసీలోని గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించాల్సిందగా కోరారు.  దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండని భారతదేశంలో యూ.ఎస్. రాయబారి కెన్ జస్టర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలో నల్ల జాతీయుల ఆందోళలో గాంధీ విగ్రహం ద్వంసం అయిందన్నారు.

మరోవైపు గాంధీ విగ్రహం ధ్వంసం ఒక విగ్రహాంపై జరిగిన దాడి కాదని భారత ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని, విచారణ వేగవంతం చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.