తప్పుగా అనుకోకండి సార్.. చంద్రబాబును క్షమాపణలు కోరిన గంగవ్వ

తప్పుగా అనుకోకండి సార్.. చంద్రబాబును క్షమాపణలు కోరిన గంగవ్వ

టీడీపీ అధినేత,  ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు  మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ క్షమాపణలు చెప్పింది.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంతకీ ఎందుకు గంగవ్వ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే.. ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఛానెల్‌లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో గంగవ్వ పాల్గొంది. 

అందులో సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను గంగవ్వతో చెప్పించారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ ఫొటోలు చూపించి.. ఈ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలంటూ గంగవ్వను అడిగారు.. దీంతో గంగవ్వ వారి పేర్లు చెప్పి.. జాతకలను తాను చెప్పనంటూ లేస్తుంది. మళ్లీ అడిగితే.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందంటూ గంగవ్వ చెబుతుంది.

 కేవలం ఈ బిట్ వరకే కట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. అదికాస్త వైరల్ అయ్యింది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు దాన్ని వైరల్ చేశారు.  ఈ క్రమంలో గంగవ్వ   ఓ వీడియోలో చంద్రబాబుకు క్షమాపణలు చెప్పింది. ఈ వీడియోలో  చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్నట్టు తెలిపింది. చంద్రబాబును క్షమాపణలు కోరింది. గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియోను ఇప్పుడు టీడీపీఅభిమానులు వైరల్ చేస్తున్నారు.