
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు రేప్ కేసు నిందితులు ఓవర్ స్పీడ్‌తో కారులో దూసుకుపోయారు. ఆ స్పీడ్‌కు కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో ఓ నిందితుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నిందితుడు స్వల్ప గాయాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులకు, నిందితులకు మధ్య 40 కిలో మీటర్ల వరకు చేజింగ్ జరిగింది. చనిపోయిన నిందితుడు అన్న, గాయపడ్డ నిందితుడు తమ్ముడు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహబత్‌పూర్ శివారులో బుధవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఈ ఘటన జరిగింది. జహీరాబాద్‌లోని పస్తాపూర్ శివారులో మంగళవారం బస్సులో గుట్కా ప్యాకెట్లతో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఇద్దరు దుండగులు పోలీసులుగా పరిచయం చేసుకొని బస్సులో నుంచి దింపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.