దోమ తెర కావాలన్న గ్యాంగ్​స్టర్ .. నో చెప్పిన జడ్జి

దోమ తెర కావాలన్న గ్యాంగ్​స్టర్ .. నో చెప్పిన జడ్జి

ముంబై: జైలులో రోజూ రాత్రి దోమలు నరకం చూపిస్తున్నయి. అధికారులు దోమ తెరలు అడిగితే ఇయ్యంపో అన్నరు. దీంతో ఓ ఖైదీ దోమల్ని చంపి ప్లాస్టిక్ బాటిల్​లో వేసుకుని కోర్టుకు తెచ్చిండు. దోమ తెరలు ఇప్పించాలని జడ్జిని అడిగిండు. ముంబైలోని సెషన్స్ కోర్టులో గురువారం ఈ ఘటన జరిగింది. 

మాఫియా డాన్ దావూద్​ఇబ్రహీం మాజీ అనుచరుడైన గ్యాంగ్​స్టర్ ఎజాజ్ లక్డావాలాను 2020లో  అరెస్ట్ చేసి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ఎజాజ్​ దోమ తెర వాడేందుకు తొలుత అనుమతి ఇచ్చిన జైలు అధికారులు ఆపై భద్రతా కారణాలతో ఈ ఏడాది మే నెలలో రద్దు చేశారు. దీంతో గురువారం కోర్టుకు వచ్చినప్పుడు జడ్జికి ప్లాస్టిక్ బాటిల్​లో తెచ్చిన దోమలను ఎజాజ్ చూపించాడు. తనతోపాటు తోటి ఖైదీలు దోమలతో అవస్థలు పడుతున్నామని తెలిపాడు. తమకు దోమ తెరలు ఇప్పించాలని కోరాడు. ఎజాజ్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు.