
కాన్పూర్ లో 8 మంది పోలీసులను హతమార్చిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబెను పోలీసులు హతమార్చారు. మధ్యప్రదేవ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద గురువారం అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..ఉత్తర్ ప్రదేశ్, కాన్పూర్ కు తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కాన్వాయ్ లోని ఓ కారు బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్ దూబే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం కాన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి