
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగాపూర్ లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 95 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. సుంగాపూర్ కు చెందిన కొడప దేవరావును అరెస్ట్ చేసి రూ. 9.5 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గంజాయి పండించడం, అమ్మడం, సేవించడం నేరమని పేర్కొన్నారు. దాడుల్లో నార్నూర్ సీఐ ప్రభాకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నార్నూర్ ఎస్సై కె అఖిల్ ఉన్నారు.