హైదరాబాద్లో టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్

హైదరాబాద్లో టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్

హైదరాబాద్లో టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతుబజార్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్ లో 2024 మార్చి 20 బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా షాపు మొత్తం మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికులు మంటలను అర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పక్కన ఉన్న మరో షాప్ కి మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

మంటలకు టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్ధమైందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. వంట సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మెయిన్ రోడ్డుకు అనుకునే ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు, చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురయ్యారు.