బిల్​గేట్స్​ను వెనక్కి నెట్టిన గౌతమ్​ అదానీ

బిల్​గేట్స్​ను వెనక్కి నెట్టిన గౌతమ్​ అదానీ

న్యూఢిల్లీ: మన దేశపు బిలియనీర్​ గౌతమ్​ అదానీ మైక్రోసాఫ్ట్​ ఫౌండర్​ బిల్​గేట్స్​ను వెనక్కి నెట్టి ఫోర్బ్స్​ రియల్​టైమ్​ ర్యాంకింగ్​లో 4 వ ప్లేస్​కి చేరారు. తన సంపదలో 20 బిలియన్​ డాలర్లను ఛారిటీకి (బిల్​ అండ్​ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​కు) ఇస్తున్నట్లు బిల్​గేట్స్​ కిందటి వారంలో ప్రకటించారు. దీంతో ఆయన సంపద ఆ మేరకు తగ్గిపోయింది. ఫలితంగా ఫోర్బ్స్​ లిస్ట్​లో 5 వ ప్లేస్​కి పరిమితమయ్యారు. బిల్​గేట్స్​ సంపద 102 బిలియన్​ డాలర్లకు తగ్గగా, గౌతమ్​ అదానీ అండ్ ఫ్యామిలీ సంపద 114 బిలియన్​ డాలర్లకు పెరిగినట్లు ఫోర్బ్స్​ తెలిపింది.  ఎలన్​ మస్క్​ 230 బిలియన్​ డాలర్ల సంపదతో ఫోర్బ్స్​ లిస్టులో టాప్​ ప్లేసులో కొనసాగుతుండగా, లూయీస్​ విటన్​ ఓనర్​ బెర్నార్డ్​ అర్నాల్ట్​ రెండో ప్లేస్​లోనూ, అమెజాన్​ జెఫ్​ బెజోస్​ మూడో ప్లేస్​లోనూ నిలిచారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధిపతి ముకేశ్​ అంబానీ 88 బిలియన్​ డాలర్ల సంపదతో  ఫోర్బ్స్​ రియల్​టైమ్​ బిలియనీర్ల లిస్టులో 10 వ ప్లేస్​లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అంబానీని అదానీ దాటేశారు. అంతేకాదు, ప్రపంచంలోనే ఎక్కువ సంపద పోగేసుకున్న వ్యక్తిగానూ ఈ ఏడాదిలో అదానీ నిలిచారు. 2021 నుంచి చూస్తే గౌతమ్​ అదానీ సంపద రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలో పేరొందిన అదానీ గ్రూప్​, పవర్​, గ్రీన్​ ఎనర్జీ, గ్యాస్​, పోర్టులు వంటి రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్​ ఎనర్జీ ప్రొడ్యూసర్​గా నిలవాలనే తన టార్గెట్​కోసం 70 బిలియన్​ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.