
ముంబై: రియల్టీ వ్యాపారం నుంచి గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది జూన్ నాటికి 7 శాతం తగ్గి రూ.52,320 కోట్లకు చేరుకుంది. ఈ రంగంలో మూడో అత్యంత సంపన్న బిలియనీర్‌గా నిలిచారని తాజా రిపోర్ట్ వెల్లడించింది. ముంబై ధారావి, మోతీలాల్ నగర్ పునరాభివృద్ధి వంటి ప్రాజెక్టులతో అత్యంత సంపన్న భారతీయులలో ఒకరిగా నిలిచిన అదానీ, రాబోయే ఐదు సంవత్సరాలలో అత్యంత సంపన్న రియల్టర్గానూ ఎదుగుతారని హురున్ రీసెర్చ్ గ్రోహే రిపోర్ట్ తెలిపింది.
డీఎల్ఎఫ్కు చెందిన రాజీవ్ సింగ్ గ్రోహె- హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 జాబితాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నెట్‌వర్త్ రూ. 1.27 లక్షల కోట్లు ఉంది.