నులిపురుగు మాత్రలు వేయాలి: కలెక్టర్ గౌతమ్

నులిపురుగు మాత్రలు వేయాలి: కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్,వెలుగు: 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని కలెక్టర్  గౌతమ్ అన్నారు.  గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని, బుధవారం ఐడీఓసీ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో  జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్,  నిర్వహించారు. జిల్లా కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో 3,11,317 మంది ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉన్నారన్నారు. 

వీరందరికి  మాత్రలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.  అనంతరం రూ. 100.78 లక్షలతో నిర్మిస్తున్న సోలార్ పార్కింగ్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలో టీఎస్‌-ఐపాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని టీఎస్‌-ఐపాస్‌ కమిటీ సమావేశంలో ఆదేశించారు.  జిల్లాలో 61 యూనిట్ల స్థాపనకు  100 దరఖాస్తులు వచ్చాయన్నారు. 88 దరఖాస్తులకు అనుమతిచ్చామన్నారు.