బీఆర్కే భవన్ ముందు గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఆందోళన

బీఆర్కే భవన్ ముందు గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఆందోళన

ఉద్యోగ, ఉపాద్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న 317జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్కే భవన్ ముందు గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఆందోళనకు దిగారు. 317 జీఓను  రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ.. టీచర్లు  ప్రగతి భవన్ ముట్టడించనున్నారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన హెడ్ మాస్టర్‎ల విభజన విషయంలో తమకు అన్యాయం జరిగిందని హెడ్ మాస్టర్స్ అంటున్నారు. జీవోను రద్దు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ఉపాధ్యాయులు ముట్టడించారు. మరి కాసేపట్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‎ను కూడా ముట్టడించనున్నారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం కెబినెట్ సమావేశం ఉండటంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

For More News..

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖబర్దార్.. హెచ్చరించిన టీఆర్ఎస్ సర్పంచ్ భర్త