జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు 

జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు 

న్యూఢిల్లీ: సాధారణ ఐటీ కంపెనీలే గాక, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీల కారణంగా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీసీసీల పేరెంట్​ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటుండడం కూడా కారణమే. 

అయినప్పటికీ భారతీయ యూనిట్లు పెద్ద టెక్నాలజీ, ప్రొడక్ట్ బాధ్యతలను తీసుకుంటున్నాయి. మనదేశంలోని 2,100పైగా జీసీజీల్లో 24 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. 

పేపాల్, వీసా వంటి  ప్రముఖ సంస్థలు 1,500 మంది ఉద్యోగులను పీకేశాయి. మొత్తం లేఆఫ్స్​ఐదు వేల వరకు ఉండొచ్చని 3ఏఐ సంస్థకు చెందిన సమీర్​ అన్నారు. ఉద్యోగుల పెంపు కంటే కంటే కంపెనీ అభివృద్ధి, భవిష్యత్​కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన వివరించారు.