మోదీ మెగా డీల్ : ఇండియాలో జెట్ ఫైటర్స్ తయారీకి అమెరికాతో ఒప్పందం

మోదీ మెగా డీల్ : ఇండియాలో జెట్ ఫైటర్స్ తయారీకి అమెరికాతో ఒప్పందం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ లో ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జీఈ ఏరో స్పేస్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు GE ఏరోస్పేస్ వెల్లడించింది. ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానం మేరకు  ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఈ తరుణంలో ఓ కీలక ప్రకటన వెలువడింది.

జీరో ఏరోస్పేస్ కు చెందిన ఎఫ్ 414 ఇంజిన్లను హెచ్ఏఎల్ తో కలిసి భారత్ లో తయారు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరినట్టు ఆ కంపెనీ తెలిపింది. భారతదేశం - అమెరికా మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో హెచ్‌ఏఎల్‌తో జరిగిన ఈ ఒప్పందాన్ని "కీలక అంశం"గా అభివర్ణించింది. ఇది ఒక చారిత్రక ఒప్పందమని ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈవో లారెన్స్ కల్ప్ జూనియర్ తెలిపారు.

https://twitter.com/ANI/status/1671812843157729280