తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి

తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడు మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: తాటి చెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన గుండ్ల జంగయ్యగౌడ్​(56) రోజువారిలాగే శుక్రవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. మోకు జారడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు.

పెయింటింగ్​ వేస్తూ కింద పడి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్​లోని నాదర్​గుల్​ శివారులో ఓ గోడౌన్​ లో ఎండీ హతీబ్(27) గురువారం సాయంత్రం షెడ్​పై పెయింటింగ్​ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. వనస్థలిపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి స్వస్థలం బీహార్​ అని పోలీసులు తెలిపారు.