బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదు

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదు

భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కమిటీ నివేదిక ఇచ్చింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశించిందని కమిటీ నివేదికలో తెలిపింది. కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ ఇబ్బంది పడ్డారని నివేదికలో వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి సాంకేతిక లోపం, కుట్ర, నిర్లక్ష్యం లేదని స్పష్టం చేసింది. ఫ్లైట్ డేటా రికార్డును విశ్లేషించి నివేదిక ఇచ్చినట్లు భారత వాయుసేన తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి..తగిన నిర్ణయాలు తీసుకుంటామని వాయుసేన తెలిపింది.