ట్రయల్ పీరియడ్ మూవీలో జెనీలియా

ట్రయల్ పీరియడ్ మూవీలో  జెనీలియా

అల్లరి చేష్టలు, క్యూట్ యాక్టింగ్ తో తెలుగు కుర్రకారులమనసు దోచుకున్న జెనీలియా వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జెనీలియా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఆమె కొత్త సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ట్రయల్ పీరియడ్ అనే టైటిల్ తో సినిమా రూపొందుతోంది. దీంతోపాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయేందుకు జెనిలియా ప్లాన్స్ వేసుకుంటుందట. మిస్టర్ మమ్మీ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ‘ట్రయల్ పీరియడ్’ కొత్త ప్రాజెక్టులో పని చేయడం ప్రారంభించింది. మే 27వ తేదీన సోషల్ మీడియాలో తన అభిమానులతో ఓ అప్ డేట్ ను పోస్టు చేసింది. కొత్త ప్రాజెక్టు కోసం షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ సినిమాను అలేయా సేన్  తెరకెక్కిస్తుండగా.. మానవ్ కౌల్ హీరోగా నటిస్తున్నాడు. 

జెనీలియా విషయానికి వస్తే... తెలుగులో చాలా సినిమాల్లో అలరించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్, నితిన్ మంచు విష్ణులతో పాటు పలువురు హీరోలతో నటించింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో నటించిన జెనీలియా.. హిందీలో స్టార్ హీరోగా ఉన్న రితేశ్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది.  9 ఏళ్ల పాటు ప్రేమ తర్వాత... 2012, ఫిబ్రవరి 03వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం ఉంటూ వచ్చింది. కొద్ది రోజులుగా ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తల  కోసం : -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ


విజయ్ 66.. ఆసక్తికర ఫొటో