100 శాతం చెత్త సేకరణ జరగాలి

100 శాతం చెత్త సేకరణ జరగాలి
  • బల్దియాలోని హెచ్ఓడీలకు కమిషనర్ ఇలంబర్తి సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్ని విభాగాల హెచ్ఓడీలకు సూచించారు. శుక్రవారం ఆయన జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. ఆయా విభాగాలు చేస్తున్న పనులను తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 100 శాతం చెత్త సేకరణ జరగాలని చెప్పారు.

 అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, స్నేహ శబరీష్, నళిని పద్మావతి, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సామ్రాట్ అశోక్, యాదగిరిరావు, అలివేలు మంగతాయారు, సత్యనారాయణ, సరోజ, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అలాగే కమిషనర్​ఇలంబర్తిని హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్, మేయర్​విజయలక్ష్మి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్​రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.