
- 3 లక్షల వినాయక ప్రతిమలను ఫ్రీగా ఇవ్వనున్న జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ
- 8 ఇంచ్‌లు, 1 ఫీట్, 1.5 ఫీట్ల ఎత్తులో పంపిణీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో నేటి నుంచి మట్టి విగ్రహాల పంపిణీ జరగనుంది. 150 వార్డుల్లో జీహెచ్‌ఎంసీ ఉచితంగా 2 లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనుంది. ప్రతి వార్డుకు 2,500 నుంచి 3 వేల విగ్రహాలు అందజేస్తారు. ఈ విగ్రహాలు 8 ఇంచ్‌లు, 1 ఫీట్, 1.5 ఫీట్ల ఎత్తులో మూడు కేటగిరీల్లో ఉంటాయి. సర్కిల్ స్థాయి అధికారులు ఈ పంపిణీని నిర్వహిస్తారు. అలాగే హెచ్‌ఎండీఏ ఈసారి 34 ప్రాంతాల్లో ఉచితంగా లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనుంది.
హెచ్ఎండీఏ పంపిణీ చేసే ప్రాంతాలివే..
ఆరోగ్యశ్రీ, సైలెంట్ వ్యాలీ హిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ నం. 10, ఐఎఎస్ క్వార్టర్స్, జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, గ్రీన్ ల్యాండ్స్ హిందూ పత్రికా కార్యాలయం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, జూబ్లీహిల్స్ టూప్స్ రెస్టారెంట్, పెద్దమ్మ టెంపుల్, మెహదీపట్నం రైతు బజార్, హైటెక్ సిటీ శిల్పారామం, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కూకట్‌పల్లి, టాంక్బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, సరూర్‌నగర్ ప్రియదర్శినీ పార్క్, వనస్థలిపురం రాజీవ్ గాంధీ పార్క్, కుందన్‌బాగ్ ఐఎఎస్ కాలనీ, దుర్గం చెరువు పార్క్ ఎంట్రెన్స్, మెల్కోటే పార్క్, నారాయణగూడ వేదిక్ ధర్మ ప్రకాశ్ స్కూల్, ఓల్డ్ సిటీ సుధా సినీప్లెక్స్ థియేటర్, సైనిక్‌పురి భారతీయ విద్యాభవన్, వాయుపురి రిక్రియేషన్ సెంటర్, సఫిల్‌గూడ పార్క్, మైండ్‌స్పేస్ జంక్షన్ మాదాపూర్, మైహోమ్ నవదీప మాదాపూర్, తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్, ఇందు అరణ్య, టీఎస్‌ఆర్టీసీ బస్ డిపో బండ్లగూడ. పూర్తి వివరాల కోసం హెచ్ఎండీఏ పీఆర్వో శ్రీకాంత్ రెడ్డి (7075465846), ఓవరాల్ ఇన్‌చార్జీ కె. శంకర్ (9849909845), జి. గణేశ్ (7989371104)ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
గణేశ్ చతుర్థిని పర్యావరణహితంగా చేసుకోవాలి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మిగణేశ్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో
కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ఉద్యోగులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పీఓపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. ఈ ఏడాది 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
పండుగ సందర్భంగా శానిటేషన్, వీధి లైట్లు, రోడ్డు మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, నిమజ్జన ఏర్పాట్ల కోసం క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్‌లు, ఎక్సవేటరీ పాండ్‌లు, తాత్కాలిక పాండ్‌ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టులలో విధులు నిర్వహిస్తారని, శోభాయాత్రల్లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేయర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.