సుందిళ్ల బ్యారేజీపై రెండ్రోజుల్లో రిపోర్టు ఇవ్వండి

 సుందిళ్ల బ్యారేజీపై రెండ్రోజుల్లో రిపోర్టు ఇవ్వండి

పెద్దపల్లి, వెలుగు : సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం, లోపాలకు సంబంధించిన రిపోర్టును సోమవారం నాటికి ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేస్తున్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్ల వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీని శనివారం ఆయన ఆధ్వర్యంలోని టీమ్ పరిశీలించింది. బ్యారేజీ గేట్ల నుంచి కింద భాగాల వరకు టీమ్ సభ్యులు తనిఖీ చేశారు. నిర్మాణంలోని లోపాలను.. ప్రస్తుతం జరుగుతున్న రిపేర్ వర్క్స్ గురించి ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాము అడిన అంశాలపై రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.