ఇండియాలో గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదు రెట్లు పెంచే అవకాశాలు

ఇండియాలో  గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదు రెట్లు పెంచే అవకాశాలు

న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాల్లో ఇండియాలో గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదు రెట్లు పెంచడానికి అవకాశాలు ఉన్నాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. కొత్తకొత్త  ట్రీట్​మెంట్లను అభివృద్ధి చేయడానికి మనదేశ బయోఫార్మా కంపెనీలకు తగిన సదుపాయాలు ఉన్నాయని తెలిపింది. యూఎస్​ఏ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ & పీడబ్ల్యూసీ ఇండియా తయారు చేసిన రిపోర్ట్​ ఈ విషయాలను బయటపెట్టింది.  ఇందులోని వివరాలు ఇలా ఉన్నాయి. అనేక అనుకూలతలు, వనరులు ఉన్నందున భారతదేశం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుకూలమైనదిగా అభివృద్ధి చెందుతోంది. రీసెర్చర్లకు,  రోగులకు సులభంగా ఉండే పద్ధతిలో మరింత సమర్థంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి బయోఫార్మాకు వసతులు ఉన్నాయి.

 వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న  రాష్ట్రాల  టైర్-1 నగరాల్లో అధునాతన వైద్య మౌలిక సదుపాయాలు,  రీసెర్చర్లు ఉన్నారు.  ఇక్కడ బయోఫార్మా కంపెనీలకు రోగులు, సైట్లు, రీసెర్చర్లు సులువుగా దొరుకుతారు. ఇండియాలోరీసెర్చర్ల సంఖ్య 2015– 2020 మధ్య రెండు రెట్లు పెరిగింది. ఇంటర్నల్​మెడిసిన్​, ఆంకాలజీ స్పెషలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పెరుగుదల ఎక్కువ ఉంది. ఇలాంటి ప్రొఫెషనల్స్​ పెరుగుదల ఎక్కువగా టైర్-1,  2 నగరాలకే పరిమితమైంది.   నొప్పి, మూర్ఛ, గర్భాశయ కేన్సర్​, తలసేమియా, డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వంటి  వ్యాధులు మరింత పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.   మొత్తం క్లినికల్ ట్రయల్స్​​ ఇండియాకు ఇప్పుడు 3.2 శాతం వాటా ఉంది. అయితే ప్రపంచంలోని శ్వాసకోశ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్షన్లు, కార్డియోవాస్కులర్, డయాబెటిస్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల బాధితుల్లో 15 శాతానికి పైగా ఇండియాలోనే ఉన్నారు. వీరిపై పెద్ద ఎత్తున క్లినికల్​ట్రయల్స్​ నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. టాప్ బయోఫార్మా కంపెనీలు టైర్-1 నగరాలు (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై) వైపు దృష్టి సారించాలి. ఇక్కడ హాస్పిటల్​ బెడ్స్​, డాక్టర్స్ ఉండటం వల్ల మరింత బాగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించవచ్చు. 

ఎక్స్​పర్టులు ఏమంటున్నారంటే..

ఈ సంవత్సరం, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందని,ఆరోగ్యాన్ని బాగుచేసే ఇన్నోవేషన్లకు జనసంఖ్యను ఉపయోగించుకోవాలని యూఎస్​ఏఐసీ బయోఫార్మా  ఆర్​&డీ ప్రెసిడెంట్ ఆండ్రూ ప్లంప్ అన్నారు.  భారతదేశంలో క్లినికల్ ట్రయల్ యాక్టివిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, క్లినికల్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రోత్సహించే అవకాశాలను గుర్తించడం, వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సహాయపడటం ముఖ్యమని అన్నారు. యూఎస్​ఏఐసీ ప్రెసిడెంట్ కరుణ్ రిషి మాట్లాడుతూ, మన దగ్గర క్లినికల్ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి పెరుగుతున్నదని, హెల్త్​కేర్​ ఫెసిలిటీలను ఉపయోగించుకోవడం ద్వారా బయోఫార్మా కంపెనీలు మరింత ముందుకు సాగవచ్చని అన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశంలో అనుకూలమైన వాతావరణం ఉందని అన్నారు. దీనివల్ల కంపెనీలు పరిశోధన సామర్థ్యం పెరుగుతుందని, రోగులకు ఆధునిక చికిత్సలను అందించవచ్చని ఆయన వివరించారు.