BWF వరల్డ్ జూనియర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ్ఞానదత్తు, వెన్నెల బోణీ

BWF వరల్డ్ జూనియర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ్ఞానదత్తు, వెన్నెల బోణీ

గువాహతి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా షట్లర్లు వ్యక్తిగత ఈవెంట్లలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ జ్ఞానదత్తు 5–-15, 15–-7, 15–-7తో  మెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాజీ (హంగేరీ), లాల్తజువాలా  15–-4, 15–-4తో  డెనిస్ ముకసా (ఉగాండా )పై గెలిచారు. గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కె. వెన్నెల 15–-1, 15–-6తో సియోఫ్రా (ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను చిత్తు చేసింది.