ఫామ్లోకి వచ్చేందుకు రంజీల్లో ఆడాలె

ఫామ్లోకి వచ్చేందుకు రంజీల్లో ఆడాలె

కోల్ కతా: టెస్టుల్లో సీనియర్ క్రికెటర్లు అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారా భారత జట్టుకు కీలకమైన బ్యాట్స్ మెన్లుగా చెప్పొచ్చు. ఈ మిడిలార్డర్ ద్వయం రాణించే తీరును బట్టి టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎన్నో మ్యాచుల్లో రాణించిన ఈ ద్వయం.. ఈమధ్య కాలంలో వరుసగా విఫలమవుతుంది. కీలక సమయాల్లో భాగస్వామ్యాలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించే రహానె.. కఠినమైన టైమ్ లో వికెట్లను కాపాడుతూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారే పుజారాల వరుస ఫెయిల్యూర్స్ భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరికి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఓ సలహా ఇచ్చాడు. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని.. రంజీలను తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని సూచించాడు. 

‘రహానె, పుజారాలు మంచి ఆటగాళ్లు. వాళ్లు రంజీల్లో ఆడాలి. అప్పుడే తిరిగి ఫామ్ అందుకోవడం సులభం అవుతుంది. డొమెస్టిక్ క్రికెట్ లో ఆడేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవనుకుంటున్నా. రంజీ ట్రోఫీ చాలా పెద్ద టోర్నమెంట్. మేం అందరమూ ఆ టోర్నీలో చాలాసార్లు ఆడాం. కాబట్టి రహానె, పుజారాలు కూడా ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్నా. ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్లిద్దరూ కేవలం టెస్టుల్లోనే  ఆడుతున్నారు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో వాళ్లు జట్టులో లేరు. కాబట్టి వాళ్లు రంజీల్లో పాల్గొనాలి’ అని దాదా చెప్పాడు. 

మరిన్ని వార్తల కోసం: 

‘గేట్’ను వాయిదా వేయడం కుదరదు

కేసీఆర్ మట్లాడిన భాష ఎక్కడా వాడకూడనిది

ఎడ్లబండిపై గురువు.. బండిలాగిన విద్యార్థులు