‘గేట్’ను వాయిదా వేయడం కుదరదు

‘గేట్’ను వాయిదా వేయడం కుదరదు

న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ (గేట్) 2022 పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొవిడ్ మహమ్మారి పరిస్థితి కారణంగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించిన విషయం తెలిసింది. ఈ పిటిషన్‌ను ఈ రోజు విచారించిన  జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఎగ్జామ్ షెడ్యూల్ కు రెండ్రోజుల ముందు  పరీక్షను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం పేర్కొంది. పరీక్షను పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థుల్లో గందరగోళం, అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. 

‘గేట్ పరీక్షకు సరిగ్గా 48 గంటల సమయం కూడా లేదు. ఈ సమయంలో ఎగ్జామ్ ను నిలిపివేస్తే అది గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి పరీక్షను వాయిదా వేయడం కుదరదు. అకడమిక్ విషయాల్లో అధికారులే నిర్ణయం తీసుకోవాలి. అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ప్రమాదకరం. విద్యార్థుల భవిష్యత్తుతో మేం చెలగాటం ఆడదలుచుకోలేదు’ అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్ మట్లాడిన భాష ఎక్కడా వాడకూడనిది

ఎడ్లబండిపై గురువు.. బండిలాగిన విద్యార్థులు

పైలట్ అప్రమత్తతో తప్పిన ల్యాండింగ్ ప్రమాదం