పిల్ల గెలాక్సీలు.. కనిపెట్టిండు మనోడు

పిల్ల గెలాక్సీలు.. కనిపెట్టిండు మనోడు
  • 1300 కోట్ల కాం తి సంవత్సరాలదూరంలోగుర్తింపు
  • గెలాక్సీ క్లస్టర్లలో ఇదే సుదూరం
  • గోవాకు చెం దిన నాసా సైంటిస్ట్

విఠల్ తిల్వీ బృందం ఘనతఈ విశ్వం ఎంతెంత దూరం..? అంటే.. సుమారుగా1370 కోట్ల కాంతి సంవత్సరాలంత దూరం అని చెప్పొచ్చు! ఎందుకంటే..1370 కోట్ల ఏండ్ల కిందట బిగ్ బ్యాంగ్ సంభవించి విశ్వం పుట్టిందని, అప్పటి నుంచి నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడి విశ్వం క్రమంగా విస్తరిస్తోందని సైంటిస్టులు చెప్తారు. అయితే, బిగ్ బ్యాంగ్ జరిగిన 68 కోట్ల ఏళ్లకు,  అంటే.. విశ్వం ఇంకా పసి వయసులోనే ఉన్న కాలంలో ఏర్పడిన ఓ గెలాక్సీల (నక్షత్ర మండలాలు)  గుంపును నాసా సైంటిస్టులు కనుగొన్నారు. ఈ గెలాక్సీల గుంపు మనకు1300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, ఇప్పటిదాకా కనుగొన్న గెలాక్సీ క్లస్టర్లలో ఇదే అత్యంత దూరమని నాసా ప్రకటించింది. గోవాలో పుట్టి, అమెరికాలో సెటిలైన విఠల్ తిల్వీ టీం దానిని కనిపెట్టింది. ఆ టీంలో సంగీతా మల్హోత్రా  అనే మరో ఇండియన్  సైంటిస్ట్ కూడా ఉండడం విశేషం!

హబుల్ టెలిస్కోప్ డేటాతో..

హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి అందిన డేటాను స్టడీ చేయడం ద్వారా విఠల్ టీం ఈ నక్షత్ర మండలాల గుంపును గుర్తించింది. దీనికి ‘ఈజీఎస్77’ అనే పేరును పెట్టారు. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి చేసిన రీసెర్చ్‌‌లో ఈ గెలాక్సీలను తాము గుర్తించగలిగామని విఠల్ వెల్లడించారు. ఈ డిస్కవరీ వివరాలను హవాయిలో ఆదివారం జరిగిన ‘అమెరికన్ ఆస్ట్రోనమికల్ సొసైటీ’ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రకటించారు. ఈ నక్షత్రమండలాల నుంచి విడుదలైన కాంతి భూమిని చేరేందుకు1300 కోట్ల కాంతి సంవత్సరాలు పట్టిందని, అంటే.. అవి విశ్వం తొలినాళ్ల నాటి గెలాక్సీలని అర్థమని విఠల్ తెలిపారు. ఇవి విశ్వం తొలినాళ్ల గెలాక్సీలు కాబట్టి, కాంతిని బట్టి వీటిలోని కెమికల్స్, ఇతర అంశాలను స్టడీ చేయొచ్చని, దానివల్ల విశ్వం తొలిరోజుల్లో ఎలా ఉండేదో తెలుస్తుందన్నారు . ఇప్పటిదాకా గెలాక్సీ గ్రూపుల నుంచి వచ్చే కాంతి హైడ్రోజన్ ఫాగ్ కారణంగా గుర్తించడం కష్టమయ్యేదని, కానీ మొదటిసారిగా ఈ గెలాక్సీల గ్రూపు నుంచి హైడ్రోజన్ ఫాగ్ లేకుండా, స్పష్టంగా కన్పించేలా కాంతి భూమిని చేరిందని టీంలోని మరో ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ సంగీతా మల్హోత్రా తెలిపారు.

నాసా టీంకు లీడర్ గా.. 

విఠల్ తిల్వీ అతి సుదూరంలోని సింగిల్ గెలాక్సీని కనుగొన్న టీంలోనూ ఉన్నారు.  ఆయన టీం 2013లో ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఆయన హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి అందిన డేటాను స్టడీ చేసే ప్రాజెక్టుకు లీడర్‌‌గా ఉన్నారు. నాసా 2025లో ప్రారంభించనున్న ‘వైడ్ ఫీల్డ్ ఇన్​ఫ్రారెడ్ సర్వే టెలిస్కోప్’ టీమ్‌‌కు కూడా ఈయనే లీడర్‌‌గా పని చేయనున్నారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్​ఎర్త్ అండ్ స్పేస్ ఎక్స్‌‌ప్లొరేషన్‌‌కు విజిటింగ్ రీసెర్చర్ గానూ కొనసాగుతున్నారు. గోవా ప్రభుత్వంలోని స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కూ విఠల్ రీసెర్చ్, డెవలప్ మెంట్, ఇన్నోవేషన్ ప్రొఫెసర్‌‌గా సహకారం అందిస్తున్నారు